: తమిళనాడు మంత్రుల జాబితాలో శశికళ బంధువు దినకరన్ కు దక్కని చోటు
అత్యంత వివాదాస్పదుడిగా పేరుగాంచిన తన సోదరి కుమారుడు టీవీవీ దినకరన్ ను అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ నిన్న శశికళ నటరాజన్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆయనకు మంత్రిపదవి దక్కుతుందని అందరూ భావించారు. అయితే, శశికళ తన బంధువర్గంలో నుంచి ఎవ్వరికీ ఆ అవకాశం ఇవ్వడానికి సానుకూలంగా లేనట్లు తెలుస్తోంది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న పళనిస్వామి తన మంత్రివర్గంలోకి శశికళ కుటుంబీకులను తీసుకోలేదు. కాగా, పార్టీలో ఆమెకు విధేయులుగా ఉన్న వారికి మాత్రమే ఆయన పదవులు ఇచ్చారు. పళనిస్వామితో పాటు ఆ రాష్ట్ర కేబినెట్‌లో 31 మంది పేర్లు ఉన్నాయి. అందులో నలుగురు మహిళా నేతలకు చోటు దక్కింది. పళనిస్వామి మొత్తం 19 శాఖలను తన వద్దే ఉంచుకున్నారు.
— AIADMK (@AIADMKOfficial) 16 February 2017