: పళనిస్వామి ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోవాలంటూ పిల్ దాఖలు
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వర్గీయుడు, పార్టీ సీనియర్ నేత పళనిస్వామి మరికొన్ని గంటల్లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. పళని స్వామిని ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకోవాలని, ఈ మేరకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు అయింది. ఈ విషయమై కోర్టు స్పందన ఏ విధంగా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది. కాగా, సీఎంగా పళనిస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.