: కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరనున్న పన్నీర్ సెల్వం వర్గం
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే శాసనసభ పక్షనేత పళనిస్వామిని ఆ రాష్ట్ర ఇన్‌ఛార్జీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆహ్వానించడంతో కంగుతిన్న పన్నీర్ సెల్వం వర్గం ఢిల్లీకి పయనం కావాలని నిర్ణయించుకుంది. కాసేపట్లో చెన్నై నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకొని ఎలక్షన్ కమిషన్‌తో భేటీ అవుతామని ఆయన వర్గ నేతలు ప్రకటించారు. ఎన్నికల కమిషన్ ముందు తమ అభ్యంతరాలను తెలపనున్నట్లు పేర్కొన్నారు.
తమిళనాడు ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే పన్నీర్ వర్గం ఈసీకి లేఖ రాసిన విషయం తెలిసిందే.