: తమిళనాడు 12వ సీఎంగా పళనిస్వామి ఈ రోజు 4.30 గంటలకు ప్రమాణ స్వీకారం!


అనూహ్య మ‌లుపులు తిరిగిన తమిళనాడు రాజకీయ సంక్షోభం ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావు తీసుకున్న నిర్ణ‌యంతో తొల‌గిపోయింది. రాజ్‌భ‌వన్‌లో భేటీ సంద‌ర్భంగా పళనిస్వామిని సీఎంగా నియమిస్తున్నట్టు, మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆయనను ఆహ్వానించినట్టు రాజ్‌భ‌వ‌న్ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ అధికారికంగా ప్ర‌క‌టన విడుద‌ల చేశారు. దీంతో ఈ రోజు సాయంత్రం 4.30 గంట‌ల‌కు త‌మిళ‌నాడు కొత్త ముఖ్య‌మంత్రిగా ఆయన ప్ర‌మాణ స్వీకారం చేస్తార‌ని అన్నాడీఎంకే పేర్కొంది. తాము బ‌ల‌నిరూప‌ణ‌కు సిద్ధ‌మేన‌ని వారు ధీమా వ్య‌క్తం చేశారు. తమిళనాడు 12వ సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.




  • Loading...

More Telugu News