: శశికళ ప్రభావం.. గోల్డెన్ బే రిసార్ట్స్ చెత్తదంటూ ‘గూగుల్’ రేటింగ్స్!
తమిళనాడులో రాజకీయ సంక్షోభం తలెత్తి, సీఎం పీఠం కోసం పోరు మొదలైనప్పటి నుంచి తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలను గోల్డెన్ బే రిసార్ట్స్ కు శశికళ తరలించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, హై డ్రామా, అక్రమాస్తుల కేసులో శశికళకు జైలు శిక్ష పడటం వంటి ప్రభావం ఈ రిస్టార్ట్స్ పై పడిందని చెప్పడానికి గూగుల్ రేటింగ్సే నిదర్శనం.
ఈ రిసార్ట్స్ లో భద్రత ఉండదని, అక్కడ పొలిటికల్ మాఫియా ఉందని, క్రిమినల్స్ చాలా తేలికగా ఈ రిసార్ట్స్ లో తలదాచుకోవచ్చని, అవసరమైతే సురక్షితంగా బయటకు వెళ్లిపోవచ్చని, ఇటువంటి వారు ఉంటున్న ఈ రిసార్ట్స్ పర్యాటకులకు ఏమాత్రం సురక్షితమో చెప్పాలని నెటిజన్లు ప్రశ్నించడమే కాదు, మండిపడుతున్నారు కూడా. దీంతో, ఈ రిసార్ట్స్ కు గూగుల్ లో వస్తున్న రేటింగ్స్ పడిపోయాయి. రిసార్ట్స్ కేంద్రంగా మొన్నటి వరకు జరిగిన హై డ్రామా నేపథ్యంలో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు మొబైల్ ట్రాకింగ్, వైఫై, ఇంటర్నెట్ సౌకర్యం లేకుండా చేశారు. ఈ రిసార్ట్స్ లోపల, బయట శశికళ వర్గీయులు మోహరించడం తెలిసిందే.