: ఇక ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వండి: గవర్నర్‌ను కోరిన పళనిస్వామి
అన్నాడీఎంకే శాసనసభ పక్షనేత పళనిస్వామితో రాజ్‌భవన్‌లో ఆ రాష్ట్ర ఇన్‌ఛార్జీ గవర్నర్ విద్యాసాగర్ రావు చర్చించిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మెజార్టీ తనకే ఉందని గవర్నర్‌కు పళనిస్వామి మరోసారి తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని ఆయన గవర్నర్‌ను కోరినట్లు సమాచారం. ప్రమాణ స్వీకారం ఆలస్యమైతే రాష్ట్ర ప్రజల్లో ప్రతికూల సంకేతాలు వెళతాయని, త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆయన గవర్నర్‌ను కోరినట్లు తెలుస్తోంది. శాసనసభలో తాను మెజార్టీని నిరూపించుకుంటానని పళనిస్వామి ధీమా వ్యక్తం చేసినట్లు సమాచారం. గవర్నర్ చేసే ప్రకటనపై ఆ రాష్ట్ర రాజకీయ నేతలతో పాటు ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.