: పళనిస్వామికే చాన్స్... రాజ్ భవన్ సంకేతాలు, కాసేపట్లో ప్రకటన!


తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి నేడు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 124 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకుందని చెబుతూ, అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేత పళనిస్వామి, గవర్నర్ కు లేక ఇచ్చిన నేపథ్యంలో, ఆయన్ను ప్రభుత్వ ఏర్పాటుకు పిలవవచ్చని రాజ్ భవన్ వర్గాల నుంచి సంకేతాలు అందాయి. ఈ మేరకు నేటి మధ్యాహ్నం ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది. పన్నీర్ సెల్వం ఏ విధమైన లేఖా ఇవ్వనందున, ఆయన రాజీనామా చేసి వున్నందున రాజ్యాంగ నిబంధనల ప్రకారం, పళనిస్వామిని పిలవాలని రాజ్యాంగ నిపుణులు సూచించిన నేపథ్యంలో విద్యాసాగర్ రావు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News