: శబరిమలలో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్


పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమలలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ ఏర్పాటుకు కేరళ మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటైతే భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని ప్రభుత్వం భావించింది. ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కార్పొరేషన్ ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించింది. బుధవారం నిర్వహించిన రాష్ట్ర కేబినెట్‌లో మంత్రివర్గం దీనికి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం శబరిమల అయ్యప్పను దర్శించుకోవాలంటే రోడ్డు మార్గమే శరణ్యం. ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటైతే భక్తులకు సౌకర్యంగా ఉండడంతో శబరిమలను సందర్శించే వారి సంఖ్య కూడా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

  • Loading...

More Telugu News