: తండ్రిని చంపాలనుకున్న పార్టీతో అఖిలేష్ చెలిమా?.. రాజకీయాలు ఇంతలా దిగజారిపోయాయా?: మోదీ ఆవేదన


ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో బుధవారం నిర్వహించిన భారీ ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ రాహుల్, అఖిలేష్‌లపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ గురించి అఖిలేష్‌కు పూర్తిగా తెలియదని, 1984లో తండ్రి ములాయంపై ఆ పార్టీ హత్యాయత్నానికి కూడా పాల్పడిందని ఆరోపించారు. అటువంటి పార్టీతో ఇప్పుడు అఖిలేష్ పొత్తు పెట్టుకున్నారని అన్నారు. సినిమా ఫస్టాఫ్‌లో బద్ధ శత్రువులుగా ఉన్న రెండు పాత్రలు ఇంటర్వెల్ తర్వాత ఒక్కటయ్యారని రాహుల్-అఖిలేష్‌ను ఉద్దేశించి వ్యంగ్యంగా అన్నారు. కాంగ్రెసేతర పార్టీల ఏలుబడిలో గత 27 ఏళ్లుగా యూపీ సర్వనాశనం అయిందంటూ యాత్రలు చేసిన రాహుల్ ఈ 27 ఏళ్ల కాలంలో ఎక్కువకాలం రాష్ట్రాన్ని  పాలించిన ఎస్పీతోనే జట్టు కట్టారని అన్నారు. తండ్రిని చంపబోయిన వారితో ఎవరైనా చెలిమి చేస్తారా? రాజకీయాలు మరింత ఇంతగా దిగజారాయా? అని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.


 
 

  • Loading...

More Telugu News