: దర్శకుడికి కారు బహూకరించిన 'సింగమ్'!
ప్రముఖ తమిళ నటుడు సూర్య 'సింగమ్' సినిమాకు సీక్వెల్ గా వచ్చిన మూడో సినిమా ‘ఎస్-3’ సూపర్ హిట్ కావడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. కేవలం ఆరు రోజుల్లోనే ‘ఎస్-3’ వంద కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. ఈ ఆనందాన్ని ‘ఎస్-3’ దర్శకుడు హరితో పంచుకున్నాడు. అంతేకాదు, హరికి ఫార్చ్యూనర్ కారును బహూకరించి సర్ప్రైజ్ చేశాడు. కాగా, ఇంతకుముందు సూర్య నటించిన ఫాంటసీ చిత్రం ‘24’ 2000 స్క్రీన్స్ లో విడుదలై సక్సెస్ సాధించగా, దానిని మించిన రీతిలో ‘ఎస్-3’ విజయవంతమై కాసుల వర్షం కురిపిస్తోంది.