: గవర్నర్ తో పళనిస్వామి భేటీ.. 40 నిమిషాల సమావేశం!
తమిళనాడు గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావుతో తాజాగా ఎన్నికైన అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేత పళనిస్వామి సమావేశమయ్యారు. 7:30 నిమిషాలకు గవర్నర్ అపాయింట్ మెంట్ ఇవ్వడంతో రాజ్ భవన్ కు సెంగొట్టియన్, జయకుమార్ తదితర 8 మంది మంత్రులతో కలిసి చేరుకున్నారు. ఈ సందర్భంగా తన మద్దతుదారుల వివరాలు, వారి సంతకాలతో కూడిన లేఖను ఆయన మరోసారి గవర్నర్ కు అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధంగా ఉన్నట్టు ఆయన గవర్నర్ కు తెలిపారు. అనంతరం సుమారు 40 నిమిషాలు సాగిన ఈ సమావేశంలో ఏం మాట్లాడారన్నది ఇంకా వెల్లడికాలేదు. ఈ నేపథ్యంలో ఆయనను ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ ఆహ్వానించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాసేపట్లో పన్నీర్ సెల్వం గవర్నర్ ను కలవనున్నారు.