: వారు కోతుల్లా ప్రవర్తించారు.. నా జీవితంలో నేను ఇంతగా ఎప్పుడూ బాధపడలేదు: చంద్రబాబు
కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు ఈ రోజు విజయవాడలో ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల తీరుపై మండిపడ్డారు. గత అసెంబ్లీలో మైకులు విరగ్గొట్టడం వంటివి చూసి తనకు ఎంతో బాధేసిందని అన్నారు. వైసీపీ శాసనసభ్యులు కుర్చీలు ఎక్కి కోతుల్లా ఎగిరారని ఆయన అన్నారు. మరోవైపు చెవుల్లో దూదిపెట్టుకున్నా భరించలేని విధంగా ఓ మహిళ మాట్లాడుతోందని ఆయన అన్నారు. తన జీవితంలో తాను అంతగా ఎప్పుడు బాధపడలేదని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో మైకులు విరగ్గొట్టే ఘటనలు మళ్లీ జరగకూడదని తాము అమరావతిలో అసెంబ్లీని కట్టుదిట్టంగా తయారు చేస్తున్నామని చెప్పారు.