: అనుష్క శర్మ.. నువ్వు నా ప్రతిరోజును అలానే మార్చేశావ్: కోహ్లీ వాలెంటైన్స్ డే మెసేజ్‌కి భారీగా స్పందన
ప్రపంచ వ్యాప్తంగా నిన్న ఘనంగా ప్రేమికుల రోజు దినోత్సవాన్ని జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రేమ జంటలు ఒకరికొకరు గిఫ్టులు ఇచ్చుకొని శుభాకాంక్షలు చెప్పుకున్నాయి. అయితే, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం తన ప్రియురాలు అనుష్క శర్మకి ఈ రోజు విషెస్ చెప్పాడు. తాను అనుష్కతో కలిసి దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అనుకోవాలేగానీ.. ప్రతి రోజు వాలెంటైన్స్ డేనే అని ఆయన పేర్కొన్నాడు. 'అనుష్క శర్మ, నువ్వు నాకు ప్రతిరోజును అలానే మార్చేశావ్..' అన్నాడు. విరాట్ చేసిన ఈ పోస్ట్‌కి ఆయన అభిమానుల నుంచి విపరీతంగా స్పందన వస్తోంది. గతేడాది అనుష్కతో విభేదాలు వచ్చాక మళ్లీ ప్రస్తుతం ఆమెకు దగ్గరయిన కోహ్లీ చాలా రోజుల తరువాత మళ్లీ తమ ఇద్దరి ఫొటోను పోస్ట్ చేశాడు.