: భూ ఆక్రమణ కేసులో మాయావతికి కోర్టు నోటీసులు
బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావతికి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. నోయిడా భూ ఆక్రమణ కేసులో మాయావతికి అలహాబాద్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ చేత విచారణ జరిపించాలని పిటిషనర్ కోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో, పిటిషన్ ను విచారించిన కోర్టు... మాయావతికి నోటీసులు జారీ చేసింది.