: 2.5 కోట్ల మార్క్ ను చేరుకున్న బిగ్ బీ
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. ట్విట్టర్లో తన ఫాలోయర్స్ సంఖ్య 25 మిలియన్ మార్క్ (2.5 కోట్లు)కు చేరుకుంది. ఈ విషయాన్ని తాను గమనించడం మరిచిపోయానని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ట్విట్టర్ లో అగ్రస్థానంలో ఉన్న భారతీయ ప్రముఖులలో ప్రధాన నరేంద్రమోదీ తొలి స్థానంలో ఉన్నారు. మొత్తం 2.71 కోట్ల మంది ఆయనను ఫాలో అవుతున్నారు. అమితాబ్ రెండో స్థానంలో ఉన్నారు. మూడో స్థానంలో షారుఖ్ ఖాన్ (2.34 కోట్లు), ఆ తర్వాతి స్థానాల్లో సల్మాన్ ఖాన్ (2.15 కోట్లు), దీపికా పదుకునే (1.74 కోట్లు), ప్రియాంక చోప్రా (1.63 కోట్లు) ఉన్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి 1.39 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారు.