: కాసేపట్లో గవర్నర్‌తో పళనిస్వామి భేటీ.. రాజ్‌భవన్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు
తమిళనాడు ముఖ్యమంత్రి పదవి కోసం పావులు కదిపిన శశికళ నటరాజన్.. ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో షాక్‌కు గురైన విషయం తెలిసిందే. ఆమె లొంగిపోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన పళనిస్వామి గవర్నర్ వద్ద అపాయింట్‌మెంట్ తీసుకొని రాజ్‌భవన్‌కు బయలుదేరారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజ్‌భవన్ వద్ద భద్రతను పెంచారు. ప్రభుత్వ ఏర్పాటుకు తనను అనుమతించాలని పళనిస్వామి కోరనున్నారు. అయితే, గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారోనని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. పళని స్వామి తమకు 119 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెబుతున్నారు. అయితే, గవర్నర్ మరోసారి పన్నీర్ సెల్వంతో కూడా భేటీ అవుతారని సమాచారం.