: లొంగిపోవడానికి నాలుగు వారాల సమయం కావాలి: శశికళ
బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో లొంగిపోవాలంటూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను ఆ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టులో లొంగిపోవడానికి తనకు నాలుగు వారాల సమయం కావాలని శశికళ కోర్టులో పిటిషన్ వేయనున్నారు. తాను అనారోగ్య కారణాలతో బాధపడుతున్నానని... దీంతో, తనకు కొంత సమయం ఇవ్వాలని పిటిషన్ లో కోర్టును కోరనున్నారు. మరోవైపు, ఆమెను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. రిసార్ట్ వద్దకు పోలీసులు భారీ ఎత్తున చేరుకున్నారు. ఎమ్మెల్యేలు మినహా రిసార్ట్ లో మరెవరూ ఉండరాదంటూ పోలీసులు అందరినీ పంపించేస్తున్నారు.