: థియేటర్లలో జనగణమనపై క్లారిటీ ఇచ్చిన సుప్రీంకోర్టు
సినిమా థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు జాతీయగీతం వేయాలని... ఆ సందర్భంగా థియేటర్ లో ఉన్న ప్రతి ఒక్కరు లేచి నిలబడి జాతీయగీతాన్ని గౌరవించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే, సుప్రీం నిర్ణయం కొంత గందరగోళానికి తెర తీసింది. సినిమా మధ్యలో జాతీయగీతం వచ్చినా చాలా మంది లేచి నిలబడుతున్నారు. ఇదే సమయంలో, పైకి లేవని వారిని చావ బాదుతున్నారు. దీనిపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. సినిమా ప్రారంభానికి ముందు జాతీయగీతాన్ని ప్లే చేసిన సమయంలోనే లేచి నిలబడాలని చెప్పింది. సినిమా కథలో భాగంగానో, లేదా డాక్యుమెంటరీలో భాగంగానో జాతీయగీతం వస్తే... లేచి నిలబడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.