: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు


తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సమావేశం ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలను తీసుకున్నారు. వాటి వివరాలు...
  • రూ. 2,858.48 కోట్ల బడ్జెట్ కు టీటీడీ ఆమోదం  
  • పేరూరు బండ వద్ద ఉన్న వకుళమాత ఆలయ నిర్మాణానికి రూ. 2 కోట్ల కేటాయింపు 
  • మార్చి 5వ తేదీన వకుళమాత ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన 
  • రూ. 11 కోట్లతో శ్రీవారికి సహస్రనామం కాసుల తయారీ 
  • అమెరికాకు చెందిన రామలింగరాజు విరాళంతో ఈ ఆభరణాల తయారీ
  • రూ. 5 కోట్లతో తిరుమలలో సర్వదర్శనం కాంప్లెక్స్ ఏర్పాటు 
  • రూ. 4.50 కోట్లతో తిరుమలలో ఎల్ఈడీ విద్యుత్ దీపాల ఏర్పాటు 
  • రూ. 12 కోట్లతో హర్యాణాలోని కురుక్షేత్రలో ఆలయ నిర్మాణం 
  • అప్పలాయగుంటలో ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో తిరుచ్చి మకరతోరణం బంగారు తాపడం పనులకు రూ. 3.80 కోట్ల కేటాయింపు 
  • అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బండమీదపల్లిలో ఆంజనేయస్వామి ఆలయ మరమ్మతులకు రూ. 22 లక్షల కేటాయింపు 
  • ఖమ్మం జిల్లా పురుషోత్తపట్నంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో వసతి సముదాయం నిర్మాణానికి రూ. 3.53 కోట్ల కేటాయింపు 
  • నెల్లూరు జిల్లా గూడూరు మండలం చెన్నూరులో కల్యాణమండపం నిర్మాణం 
  • ముడిసరుకుల కొనుగోలుకు రూ. 20 కోట్లు    

  • Loading...

More Telugu News