: రిసార్టుకి బయలుదేరిన పన్నీర్ సెల్వం వర్గం
సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత పన్నీర్ సెల్వం నివాసం వద్ద ఆయన వర్గీయులు టపాసులు కాల్చి, డ్యాన్సులు వేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. మరోవైపు పన్నీర్ సెల్వం వర్గం ఎమ్మెల్యేలు, ఎంపీలు గోల్డెన్ బే రిసార్టు వద్దకు ర్యాలీగా బయలుదేరారు. బందీలుగా ఉన్న ఎమ్మెల్యేలకు విముక్తి కలిగిస్తామని వారు నినాదాలు చేశారు. ఈ విషయంపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
మరోవైపు శశికళకు మద్దతు తెలుపుతున్న వర్గంలో ఆందోళన మొదలైంది. సుప్రీంకోర్టు తీర్పుతో పన్నీర్ వర్గం దూకుడుగా ముందుకు వెళుతుండడంతో, నిన్నటి వరకు హుషారుగా కనిపించిన శశికళ వర్గం ఈ రోజు నిరాశలో కూరుకుపోయింది. మరికాసేపట్లో పళనిస్వామి వర్గం రాజ్‌భవన్‌కు బయలుదేరనుంది.