: ప్రమాణ స్వీకారం చేసిన తరువాత సభలోనూ బలం నిరూపించుకుంటా: పళనిస్వామి
అక్రమాస్తుల కేసులో నిందితురాలిగా ఉన్న శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో అన్నాడీఎంకే రహదారుల శాఖ మంత్రి ఎడపాడి పళనిస్వామిని తమ పార్టీ శాసనసభ పక్షనేతగా శశికళ వర్గం నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పళనిస్వామి మాట్లాడుతూ... కాసేపట్లో తాను గవర్నర్ విద్యాసాగర్‌రావును కలుస్తానని చెప్పారు. తమకు 129 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, తాను మొదట ప్రమాణస్వీకారం చేస్తానని, ఆ తరువాత బలనిరూపణ జరపాలని తాను గవర్నర్ ను కోరనున్నట్లు తెలిపారు. తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు శశికళ తమ పార్టీ నేతలతో రిసార్టులో చేస్తున్న చర్చలు కొనసాగుతున్నాయి.