: వైసీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి.. సాదరంగా ఆహ్వానించిన జగన్


తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి కొప్పన మోహన్ రావు ఈరోజు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాదులోని లోటస్ పాండ్ కు వచ్చిన మోహన్ రావును వైసీపీ అధినేత జగన్ సాదరంగా ఆహ్వానించారు. జగన్ పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మోహన్ రావు మాట్లాడుతూ, దివంగత రాజశేఖర్ రెడ్డి చేసిన అభివృద్ధి, పేదల అభ్యున్నతి కోసం జగన్ చేస్తున్న పోరాటాల పట్ల ఆకర్షితుడినై వైసీపీలో చేరుతున్నానని చెప్పారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు తన జిల్లాలో తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కోట్ల విజయభాస్కరరెడ్డి హయాంలో కొప్పన అటవీశాఖ మంత్రిగా పని చేశారు.

  • Loading...

More Telugu News