: తెలంగాణ మంత్రి కుమారుడిపై కేసు నమోదు


తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు కుమారుడు రామేశ్వర్ గౌడ్ పై పోలీసు కేసు నమోదైంది. సికింద్రాబాదులోని మార్కెట్ పోలీస్ స్టేషన్ లో కేసును నమోదు చేశారు. సికింద్రాబాదులోని ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపు నేపథ్యంలో ఏర్పడ్డ వివాదంలో... తనపై రామేశ్వర్ గౌడ్ దాడి చేశాడంటూ స్థానిక వ్యాపారి రాజేష్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో, బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు మంత్రి కుమారుడిపై కేసు నమోదు చేశారు.   

  • Loading...

More Telugu News