: శశికళ జైలుకు వెళ్లాల్సి వస్తే... తరువాతి చాన్స్ ఎవరికట?


దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో పాటు శశికళ నిందితురాలిగా ఉన్న ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించనున్న నేపథ్యంలో, పరిస్థితులు అనుకూలంగా లేక తాను జైలుకు వెళ్లాల్సి వస్తే, తదుపరి అన్నాడీఎంకే శాసన సభా పక్ష నేతగా ఎవరిని నియమించాలన్న విషయంలో శశికళ మంతనాలు చేస్తున్నారు. సెంగొట్టయ్యన్, ఎడప్పాడి పళనిస్వామి, తంబిదురైలలో ఒకరిని నియమించాలని భావిస్తున్నట్టు తన మనసులోని మాటను ఎమ్మెల్యేల ముందు వెల్లడించారు శశికళ. గత రాత్రంతా ఎమ్మెల్యేలతో కలసి గోల్డెన్ బే రిసార్ట్స్ లో బసచేసిన ఆమె, నేడు తీర్పు వెల్లడైన తరువాతనే తదుపరి కార్యాచరణకు దిగనున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News