: పన్నీర్ సెల్వంను చంపేస్తానని హెచ్చరించిన శశికళ వర్గీయుడిపై కేసు నమోదు


తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను హతమారుస్తానంటూ హెచ్చరించిన శశికళ వర్గీయుడు, అన్నా డీఎంకే మాజీ ఎమ్మెల్యే వీపి కలైరాజన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. శశికళ అత్యంత విధేయుడైన కలైరాజన్, పన్నీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో పాటు, ఆయన్ని హతమారుస్తానంటూ వ్యాఖ్యలు చేయడంపై పోలీసులు దర్యాప్తు చేశారు. అనంతరం పలు సెక్షన్ల కింద కలైరాజన్ పై ఈ రోజు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ముఖ్యమంత్రి పదవికి తన చేత శశికళ బలవంతంగా రాజీనామా చేయించారని పన్నీర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే కలై రాజన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News