: పన్నీర్ సెల్వం మానసికస్థితి బాగోలేదు: శశికళ నటరాజన్


తమిళనాడు సీఎం ప‌దవిని ద‌క్కించుకునే క్ర‌మంలో దూకుడుగా ముందుకు వెళుతున్న శ‌శిక‌ళ న‌ట‌రాజ‌న్ మ‌రోసారి త‌న ప్ర‌త్య‌ర్థి ప‌న్నీర్ సెల్వంపై మండిప‌డ్డారు. ఆయన చేతికంటిన దుమ్ములాంటి వాడని, తాము ఆ దుమ్మును దులిపేస్తామని అన్నారు. అంతేగాక‌, పన్నీర్ సెల్వం మానసిక స్థితి బాగోలేదని ఆమె వ్యాఖ్యానించారు. జ‌య‌ల‌లితతో త‌న‌కు 33 ఏళ్ల అనుబంధం ఉంద‌ని, తాను ఏనాడు పదవులను ఆశించలేదని పేర్కొన్నారు. త‌మ పార్టీలో ఈ సంక్షోభానికి బీజేపీ, డీఎంకేలే కారణమని ఆరోప‌ణ‌లు చేశారు. 1.60 లక్షల మంది కార్యకర్తలు త‌మ‌తో ఉన్నారని ఆమె ధీమా వ్య‌క్తం చేశారు. ప్రస్తుతం ఆమె తమ పార్టీ ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News