: ధోనీ రికార్డులను దాటేసిన కోహ్లీ!
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాజీ కెప్టెన్ ధోనీ రికార్డులను దాటేశాడు. టెస్టుల్లో ధోనీ అజేయంగా ఏడు సిరీస్ లలో విజయం సాధించగా, ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఏకైక టెస్టు సిరీస్ తో కోహ్లీ, ధోనీ అజేయ టెస్టు సిరీస్ ల రికార్డును దాటేశాడు. ఒక్క టెస్టే అయినప్పటికీ ఐసీసీ లెక్కప్రకారం భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగింది సిరీస్. ఈ టెస్టులో భారత్ 208 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడంతో అజేయంగా ఎనిమిది టెస్టు సిరీస్ లలో కోహ్లీ అప్రతిహత విజయాలు సాధించాడు. దీంతో సునీల్ గవాస్కర్ తరువాత అజేయంగా అత్యధిక టెస్టు సిరీస్ లలో విజయం సాధించిన టీమిండియా కెప్టెన్ గా కోహ్లీ రికార్డు పుటలకెక్కాడు. కాగా, కోహ్లీ ఇప్పటి వరకు ఉపఖండం పిచ్ లపై అద్భుతమైన విజయాలు సాధించిన కెప్టెన్ గా నిలిచాడు. విదేశాల్లో కోహ్లీ విజయాల రికార్డును మరింత మెరుగుపరుచుకోవాల్సి ఉంది.