: రాజకీయాలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన కమలహాసన్


తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ప్రముఖ నటుడు కమలహాసన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం రెండు రకాలని... శిక్ష పడుతుందన్న భయంతో అధికారం చేజిక్కించుకోవాలనుకోవడం ఒక రకమని... ప్రేమపూర్వకంగా అధికారాన్ని స్వీకరించడం రెండో రకమని చెప్పారు. మహాత్మాగాంధీని ఉటంకిస్తూ రెండో రకం గురించి కమల్ తెలిపారు. అయితే ఎవరి పేరును ప్రస్తావించకుండానే... తమిళనాడులో ప్రస్తుతం జరుగుతున్నది ఇదే అని కమల్ ట్వీట్ చేశారు.

 అయినా, ఎవరి గురించి కమల్ వ్యాఖ్యానించారో... నెటిజన్లు తేలికగానే పసిగట్టేశారు. కమల్ కామెంట్లపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుత రాజకీయాలపై స్పందించేందుకు భయపడే వారికంటే మీరే బెటర్ అని... భయం లేకుండా అభిప్రాయాన్ని వెల్లడించారని ఓ నెటిజన్ స్పందించాడు. ఏళ్ల తరబడి మమ్మల్ని మోసం చేసిన సూపర్ స్టార్ల కంటే మీరే గ్రేట్ అని మరో నెటిజన్ స్పందించాడు. 

  • Loading...

More Telugu News