: 24 గంటల్లో మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి: హైకోర్టును ఆశ్రయించిన శశికళ
తమిళనాడు రాజకీయాల్లో ఏర్పడిన ఉత్కంఠకర పరిస్థితులు కొనసాగుతున్నాయి. తనకు పార్టీలో పూర్తి మెజార్టీ ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని అన్నాడీఎంకే పార్టీ జనరల్ సెక్రటరీ శశికళ నటరాజన్ ఇటీవల ఆ రాష్ట్ర ఇన్ఛార్జీ గవర్నర్ విద్యాసాగర్ రావును కోరిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటివరకు గవర్నర్ ఓ నిర్ణయం తీసుకోకపోవడంపై శశికళ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఆమె ఇదే విషయంపై మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. పలు ఆర్టికల్స్ ప్రకారం ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని ఆమె తరఫు అడ్వొకేట్ ఏఎల్ శర్మ న్యాయస్థానంలో పిల్ దాఖలు చేశారు. పార్టీలో మెజార్టీ ఎమ్మెల్యేలు శశికళవైపే ఉన్నారని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మద్దతున్నా గవర్నర్ ఆహ్వానించడం లేదని పిల్లో పేర్కొన్నారు.