: ఆ ఇద్దరు దర్శకులతో పనిచేయడం అంటే చాలా ఇష్టం: అనంత శ్రీరాం
తనకు ఇద్దరు దర్శకులతో పనిచేయడం అంటే చాలా ఇష్టమని గీత రచయిత అనంత శ్రీరాం అన్నారు. ఈ రోజు ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... పాటలో ప్రతీ లైను తాలుకు బాధ్యత తీసుకొని, ఆ పాట ఇలాగే కావాలని విడమర్చి చెప్పే రాజమౌళితో పనిచేయడమంటే తనకి ఇష్టమని అన్నారు. పాటను ఆయనకు ఇష్టం వచ్చినట్లు రాయించుకుంటారని అన్నారు. ఇక మరో దర్శకుడు గౌతమ్ మీనన్‌తో పనిచేయడం అన్నా కూడా తనకు ఇష్టమని చెప్పారు. గౌతమ్ మీనన్.. రాజమౌళికి పూర్తి భిన్నంగా పాటను రచయిత ఇష్టానికే వదిలేస్తారని, దాంతో పెద్ద బాధ్యతతోనే రాయాల్సివుంటుందని, ఆ పాటలలో ఆయన ఏమీ కల్పించుకోరని అన్నారు.
తాను ప్రత్యేకంగా హీరోని దృష్టిలో పెట్టుకొని కాకుండా కథ, సన్నివేశం వంటి వాటిని దృష్టిలో పెట్టుకొని పాటలు రాస్తానని అనంత శ్రీరాం చెప్పారు. తనకు తాను రాసిన పాటల్లో 'పచ్చబొట్టేసినా పిల్లగాడా', 'చలిచలిగా అల్లింది' లాంటి పాటలు బాగా నచ్చాయని అన్నారు. కాటమరాయుడు సినిమా కోసం కూడా ప్రస్తుతం పాటలు రాస్తున్నానని అన్నారు. తన చేతిలో ప్రస్తుతం 11 సినిమాలు ఉన్నాయని చెప్పారు.