: పన్నీర్ గూటికి మరో 10 మంది!


జయలలిత నమ్మినబంటు, తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు మద్దతు అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే అన్నాడీఎంకేకు చెందిన 11 మంది ఎంపీలు, ఆయన వర్గంలో చేరారు. ఏడుగురు ఎమ్మెల్యేలు ఆయనతో పాటు ఉన్నారు. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న శశికళకు మరో షాక్ తగిలేలా ఉంది. మరో 10 మంది ఎమ్మెల్యేలు పన్నీర్ శిబిరంలో చేరేందుకు సిద్ధమయ్యారనే వార్త ఇప్పుడు ప్రకంపనలు పుట్టిస్తోంది.  వీరిలో కేంద్ర ప్రభుత్వంతో అత్యంత సన్నిహితంగా ఉండే ఎంపీలు కూడా ఉన్నారని సమాచారం. మరోవైపు శశికళ క్యాంపు రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆమెకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు గోల్డెన్ బే రిసార్ట్స్ లోనే ఉన్నారు.

  • Loading...

More Telugu News