: ఈడీ నోటీసులతో వైసీపీలో కలకలం.. కేంద్రం పాత్రపై అనుమానాలు
అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్ కు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకునే క్రమంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇచ్చిన నోటీసులు ఆ పార్టీ శ్రేణుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ ఆ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి ఈడీ నోటీసులను పార్టీ శ్రేణులు తేలికగానే తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, దీని వెనుక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉంటే మాత్రం పరిస్థితి తీవ్రంగా ఉంటుందని జగన్ సన్నిహిత వర్గాలు భావిస్తున్నాయి. ఇదే నిజమైతే భవిష్యత్తులో అనేక ఇబ్బందులు తప్పవనే అనుమానాలు వారిలో మెదులుతున్నట్టు సమాచారం.