: పార్టీని కాపాడుకోవడానికి నా జీవితాన్ని అర్పిస్తా: శశికళ
అన్నా డీఎంకే పార్టీని కాపాడుకోవడానికి తన జీవితాన్ని అయినా సరే అర్పిస్తానని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ అన్నారు. తాను ఎవ్వరికీ తలవంచనని, పన్నీర్ సెల్వం పార్టీకి ద్రోహం చేశారని, అన్నాడీఎంకేను చీల్చేందుకు పన్నీర్ వర్గం కుట్ర పన్నిందని ఆరోపించారు. తమకు 129 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, వారందరూ తన వెనుక వచ్చారని శశికళ పేర్కొన్నారు.