: పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి కావాలంటూ 30 లక్షల మంది మిస్‌డ్ కాల్స్


పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ఇప్పటి వరకు 30 లక్షల మంది మిస్‌డ్ కాల్స్ చేసినట్టు అన్నాడీఎంకే సాంకేతిక విభాగం తెలిపింది. పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి కావాలనుకునేవారు 92892 22028 నంబరుకు మిస్‌డ్ కాల్ ఇవ్వాలని కోరగా లక్షలాదిమంది స్పందించినట్టు పేర్కొంది. ఈనెల 8న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా అనూహ్య స్పందన వచ్చింది. తొలి 45 నిమిషాల్లోనే ఏకంగా 20 వేల మంది, మూడు గంటల్లో 1.20 లక్షల మంది మిస్‌డ్ కాల్స్ ఇచ్చారు. శనివారం సాయంత్రం వరకు ఏకంగా 30 లక్షలమంది మిస్‌డ్ కాల్స్ చేశారని, వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్న పన్నీర్ సెల్వం వాయిస్‌ను ఎస్సెమ్మెస్ ద్వారా పంపించినట్టు సాంకేతిక విభాగం నిర్వాహకులు తెలిపారు.

  • Loading...

More Telugu News