: అత్యంత చాకచక్యంగా సిమి ఉగ్రవాది పర్వేజ్‌ను పట్టుకున్న పోలీసులు
భారత్‌లో సిమి ఉగ్రవాద సంస్థల నుంచి ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు పలు సందర్భాల్లో హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ రోజు మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రాంతంలో సిమి ఉగ్రవాది పర్వేజ్‌ను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఆ ఉగ్రవాది గురించి అందిన సమాచారం మేరకు 10 మంది ఏటీఎస్ పోలీసుల టీమ్ వెళ్లింది. ఉగ్రవాదిని పోలీసు అధికారులు విచారిస్తున్నారు.