: షారుఖ్ పోస్ట్ చేసిన ఫొటో.. సోషల్ మీడియాలో హల్ చల్
బాలీవుడ్ అగ్రనటులు ఆమిర్ ఖాన్, షారుక్ ఖాన్లు కలిసి దిగిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. నిన్న రాత్రి దుబాయ్‌లోని అజయ్ బిజిలీ అనే వ్యాపారవేత్త బర్త్‌డే పార్టీకి వెళ్లిన వారు ఇద్దరు కలిసి ఫొటో దిగారు. ఈ ఫొటోను షారుక్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. 25 ఏళ్లుగా ఒకరికొకరం తెలుసని, తామిద్దరం కలిసి దిగిన ఫొటో ఇదని, నిన్న రాత్రి చాలా సరదాగా గడిపామని షారుఖ్ అందులో పేర్కొన్నాడు. షారుక్ ట్విట్టర్లో పెట్టిన ఈ ఫొటోకి కొన్ని గంటల్లోనే వేలకొద్దీ లైక్‌లు, కామెంట్లు, షేర్లు వచ్చాయి.
Known each other for 25 years and this is the first picture we have taken together of ourselves. Was a fun night. pic.twitter.com/7aYKOFll1a
— Shah Rukh Khan (@iamsrk) February 10, 2017