: గవర్నర్ ఆదేశాలతో చెన్నైలో ముమ్మర తనిఖీలు
చెన్నైలోని ప్రతి లాడ్జ్, రిసార్ట్ లను సిటీ పోలీసులు జల్లెడ పడుతున్నారు. వీటిలో బస చేసిన వారి వివరాలను సేకరిస్తున్నారు. లాడ్జ్, రిసార్ట్స్ లో బస చేసిన వారి వివరాలను సేకరించాలని సిటీ కమిషనర్ ను తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్ రావు ఆదేశించారు. ఈ నేపథ్యంలో, సిటీ పోలీసులను కమిషనర్ రంగంలోకి దించారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో, చెన్నైలో అలజడులు చెలరేగే అవకాశాలు ఉండటంతో... గవర్నర్ విద్యాసాగర్ రావు పోలీసు శాఖను అప్రమత్తం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అల్లరిమూకలు చెన్నైకి చేరుకున్నారని... ఏ క్షణంలోనైనా వారు అలజడికి పాల్పడే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ రిపోర్టులు వచ్చాయి.