: ఎయిర్ పోర్టులో రూ.54.67 లక్షల విలువైన బంగారం బిస్కెట్లు స్వాధీనం
ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో సాధారణ తనిఖీల్లో భాగంగా ప్రయాణికుల సోదాలు నిర్వహిస్తోన్న కస్టమ్స్ అధికారులు ఓ ప్రయాణికుడి వద్ద భారీగా బంగారం ఉందని గుర్తించారు. సదరు ప్రయాణికుడిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా రూ.54.67లక్షల విలువైన బంగారం లభ్యమైంది. ఆ ప్రయాణికుడు ఈ రోజు ఉదయం దుబాయి నుంచి ముంబయి ఎయిర్‌పోర్టుకి చేరుకున్నాడని అధికారులు మీడియాకు తెలిపారు. తాము స్వాధీనం చేసుకున్న బంగారం అంతా 18 బంగారు బిస్కెట్ల రూపంలో ఉందని తెలిపారు. సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ ప్రారంభించారు.