: మరో నిర్ణయం తీసుకోబోతున్నామంటూ షాక్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్‌


అమెరికా అధ్య‌క్షుడిగా ప్ర‌మాణ స్వీకారం చేసినప్ప‌టి నుంచి సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్న డొనాల్డ్ ట్రంప్ త‌న‌కు ఎన్ని అడ్డంకులు వ‌స్తున్నా ఎవ‌రిమాటా విన‌డం లేదు. తాజాగా తాను తీసుకోనున్న మ‌రో చ‌ర్య గురించి చెప్పి అంద‌రినీ షాక్‌కు గురిచేశారు. అమెరికాలో  వలసల నిషేధంపై కొత్త చట్టాన్ని తీసుకొచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నామని ఆయ‌న‌ చెప్పారు. ఇటీవ‌ల ఆయ‌న ఏడు మెజారిటీ ముస్లిం దేశాల ప్ర‌జ‌లు అమెరికాలోకి రాకుండా ఎగ్జిక్యూటివ్ ఆర్డ‌ర్‌పై సంత‌కం చేయ‌డం, దానికి కోర్టు అడ్డుప‌డ‌డం వంటివి జ‌రిగాయి.

 ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న ఈ కొత్త చ‌ట్టం అంశాన్ని ప‌రిశీలిస్తున్నారు. తాజాగా ఆయ‌న విమానంలో ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యాన్ని గురించి తెలిపారు. తాము విజయం సాధిస్తామని, అందుకు త‌మ‌కు ఎన్నో మార్గాలు ఉన్నాయని, ఆ మార్గాల్లో కొత్త చట్టాన్ని తీసుకురావటం ఒకటని వ్యాఖ్యానించారు. చిన్న మార్పులతో దీనిని తీసుకొస్తామ‌ని, దీనిపై వారంలోపే ఒక అడుగు ముందుకేస్తామ‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News