: రాజకీయాలకు దూరంగా ఉండమని రజనీకి అమితాబ్ సలహా ఇచ్చారట!


తమిళనాడు సంక్షోభం ఓ కొలిక్కి రాని పరిస్థితుల్లో పలు ఊహాగానాలు, వదంతులు సామాజిక మాధ్యమాలు, మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. పన్నీర్ సెల్వంకే సీఎం కుర్చీ దక్కుతుందని కొందరు; శశికళ ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకుంటారని, ఎమ్మెల్యేల బలం ఆమెకు సరిపడా ఉందని కొందరు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు తెరపైకి వచ్చింది.

ఆయన కొత్త పార్టీ స్థాపించనున్నారని, ఈ మేరకు మంతనాలు జరుపుతున్నారని, బీజేపీలోకి రజనీని తీసుకువచ్చేందుకు ఆర్ఎస్ఎస్ సిద్ధాంత కర్త గురుమూర్తిని రంగంలోకి దింపారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ వార్తలను నమ్మవద్దని గురుమూర్తి తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. తాజాగా, బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ ప్రస్తావన వచ్చింది. అమితాబ్, రజనీ కాంత్ కలిసి హమ్, గిరఫ్తార్, అంధాకానూన్ వంటి సినిమాల్లో నటించారు. వారి మధ్య సాన్నిహిత్యం ఉండటంతో తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో రజనీకి అమితాబ్ ఓ సలహా ఇచ్చారట. రజనీని
క్రియాశీలక రాజకీయాల్లోకి రావొద్దని అమితాబ్ ఫోన్ చేసి మరీ చెప్పారట.

  • Loading...

More Telugu News