: నెటిజన్లకు ఘాటుగా సమాధానమిచ్చిన హాట్ యాంకర్ అనసూయ
యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ 'విన్నర్' సినిమాలో హాట్ యాంకర్ అనసూయ ఓ ఐటెం సాంగ్ చేసింది. ఈ సాంగుకు బుద్ధుడి విగ్రహం ముందు అనసూయ స్టెప్పులు వేసింది. దీంతో, నెటిజన్లు అనసూయపై ఓ రేంజ్ లో విమర్శలు చేశారు. బుద్ధుడి విగ్రహం ముందు అర్ధనగ్నంగా డ్యాన్స్ చేయడం ఏమిటంటూ మండిపడ్డారు. ఈ ప్రశ్నలకు అనసూయ తనదైన శైలిలో ఘాటుగా సమాధానం ఇచ్చింది. ఈ పాటను ఉక్రెయిన్ లోని బుద్ధ బార్ లో చిత్రీకరించారని... ఆ బార్ లో బుద్ధుడి విగ్రహం ముందే అందరూ మందు తాగుతారని... బుద్ధుడి ముందు తాగడం తప్పు కానప్పుడు, మేము డ్యాన్స్ చేస్తే తప్పేంటని అనసూయ ప్రశ్నించింది. పాట కోసం తాము విగ్రహం పెట్టలేదని, బార్ లోనే ఆ విగ్రహం ఉందని... కావాలంటే గూగుల్ లో వెత్తుక్కోండని సూచించింది. ఇతరులను గౌరవించడం చేతకాని వారికి... దేవుడి గురించి మాట్లాడే అర్హత ఎక్కడుంటుందని ప్రశ్నించింది.