: రాజీనామా చేయ్ అనగానే ఒంగొని వినయంగా ఎస్ మామ్ అంటానా?: ప‌న్నీర్ ‘కబాలీ’ డైలాగ్‌ వీడియో వైర‌ల్


‘క‌బాలీ అంటే సినిమాల్లో ముఖం మీద గాటు పెట్టుకొని, మీసాలు మెలి తిప్పి, లుంగీ కట్టుకుని, పాత విలన్ 'హే బిత్తిరి' అనగానే ఒంగొని వినయంగా ఎస్ బాస్..అని నిలబడుతాడే ఆ కబాలీ అనుకున్నార్రా.. కబాలీ రా’ అంటూ సూపర్ స్టార్ రజనీ వదిలిన డైలాగ్స్ తమిళ జనాన్ని హుషారెత్తించిన విషయం తెలిసిందే. ప్ర‌స్తుతం త‌మిళంలో ప‌న్నీర్ సెల్వం క‌బాలీలా అయిపోయారంటూ ప‌న్నీర్ మ‌ద్ద‌తుదారులు రూపొందించిన ఓ వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారింది.

‘‘అమ్మ ఉన్నప్పుడు బొట్టుపెట్టుకుని, గడ్డం గీయించుకుని, లుంగీ దించుకుని ఉన్నాను కదా అని, ఇప్పుడు చిన్నమ్మ వచ్చి రాజీనామా చేయ్ అనగానే ఒంగొని వినయంగా ఎస్ మామ్ అనడానికి పాత సెల్వం అనుకుంటున్నారా? సీఎం సెల్వం రా...’’ అంటూ ప‌న్నీర్ సెల్వం డైలాగుతో వీడియో విడుద‌లైంది.

సెల్వం మద్దతుదారులు వ‌దిలిన ఈ వీడియో ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. అంతేగాక‌, సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో పాటల్ని బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టి సెల్వం వీడియోలను విడుదల చేస్తున్నారు. ర‌జినీ భాషా సినిమాలోని డైలాగ్సు కూడా వాటిల్లో క‌నిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News