: నేను ఇంత సహజంగా నటించడానికి కారణం అదేనేమో!: తాప్సీ


నటనలో తాను ఎలాంటి శిక్షణ తీసుకోక పోవడం అన్నది తనకు ప్లస్ పాయింట్ గా మారిందని... సన్నివేశానికి తగ్గట్టుగా తాను నటించడానికి ఇదే కారణమని హీరోయిన్ తాప్సీ తెలిపింది. ప్రేక్షకులు తన నుంచి ఇదే కోరుకుంటున్నారని చెప్పింది. కామెడీ చేయడం కంటే, సహజసిద్ధంగా ఉండే పాత్రల్లో నటించడమే తనకు చాలా తేలిక అని తెలిపింది. తాను నటించిన బేబీ, పింక్ సినిమాలను ఆదరించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసింది. గత మూడేళ్లుగా వరుస సినిమాలతో తాను చాలా బిజీగా ఉన్నానని... ఈ ఏడాది ఐదు సినిమాలు చేస్తున్నానని తాప్సీ తెలిపింది. మరోవైపు దగ్గుబాటి రానాతో కలసి నటించిన 'ఘాజీ' సినిమా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

  • Loading...

More Telugu News