: జల్లికట్టు తరహాలో పన్నీర్ కోసం ఆందోళనలు.. మెరీనా బీచ్ లో భారీ బందోబస్తు


మాట్లాడటమే రాదనుకున్న తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం... ఒక్కసారిగా విశ్వరూపం ప్రదర్శించారు. ఆయన మాటల తూటాలకు, తెగువకు, ధిక్కార స్వరానికి శశికళ వర్గం బిత్తరపోయింది. మరోవైపు, తమిళనాట పన్నీర్ కు భారీ ఎత్తున మద్దతు పెరుగుతోంది. శశికళ సీఎం పీఠంపై కూర్చోవడం తమకు ఇష్టం లేదని... జయ నమ్మినబంటు పన్నీర్ మాత్రమే ఆ స్థానంలో ఉండాలంటూ సోషల్ మీడియాలో లక్షలాది కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో, చెన్నైలోని మెరీనా బీచ్ లో పన్నీర్ కు మద్దతుగా ఆందోళనలు, ఉద్యమాలు జరిగే అవకాశాలు ఉన్నాయని పోలీసు శాఖ భావిస్తోంది. జల్లికట్టు కోసం జరిగినంత ఉద్ధృతంగా ఈ ఆందోళనలు కూడా ఉంటాయని పోలీసు అధికారులు భావిస్తున్నారు. దీంతో, మెరీనా బీచ్ వద్ద భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News