: తిరుమల శ్రీవారికి శివ నాడార్ రూ.2 కోట్ల విరాళం!


తిరుమల శ్రీవారికి హెచ్ సీఎల్ అధినేత శివ నాడార్ రూ.2 కోట్ల విరాళాన్నిసమర్పించారు.ఈ రోజు స్వామి వారిని దర్శించుకున్న ఆయన, విరాళానికి సంబంధించిన డీడీలను టీటీడీ ఈవో సాంబశివరావుకు అందజేశారు. ఈ విరాళం మొత్తాన్ని బర్డ్ ట్రస్ట్ కింద డిపాజిట్ చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. అనంతరం, శివ నాడార్ ను టీటీడీ అధికారులు సన్మానించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు.

  • Loading...

More Telugu News