: తన నివాసంలో మద్దతుదారులతో సమావేశమైన పన్నీర్ సెల్వం
తమిళనాడు ఇన్‌ఛార్జీ గవర్నర్ విద్యాసాగర్ రావుతో ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం భేటీ అయి తన అభిప్రాయాలను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం తన నివాసానికి వెళ్లిన పన్నీర్ సెల్వం కొద్ది సేపటి క్రితం తన మద్దతుదారులతో కీలక భేటీ ఏర్పాటు చేశారు. ఆయన ఇంటి వద్దకు చేరుకున్న పలువురు అన్నాడీఎంకే నేతలు విజయం తమదే అన్నట్లుగా కనిపించారు. తమ భవిష్యత్ కార్యాచరణపై ఈ భేటీలో చర్చించనున్నట్లు మీడియాకు తెలిపారు. గవర్నర్ తీసుకునే నిర్ణయం ఎలా ఉండబోతోంది? ఏ నిర్ణయం తీసుకుంటే ఏ వ్యూహాన్ని అనుసరించాలి? అన్న అంశంపై వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.