: గవర్నర్‌తో భేటీ అయిన శ‌శిక‌ళ.. సర్వత్రా ఉత్కంఠ


చెన్నై మెరీనా తీరంలో ఉన్న తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సమాధికి నివాళులు అర్పించి, గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్‌ రావు వ‌ద్ద‌కు బ‌య‌లుదేరిన‌ అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ శశికళ నటరాజన్ రాజ్‌భ‌వ‌న్ వ‌ద్ద‌కు చేరుకున్నారు. అనంత‌రం ఆమె విద్యాసాగ‌ర్ రావుతో భేటీ అయ్యారు. త‌న‌కు మ‌ద్ద‌తు తెలుపుతూ ఎమ్మెల్యేల నుంచి తీసుకున్న లేఖ‌లను ఆమె ఆయ‌న‌కు స‌మ‌ర్పించ‌నున్నట్లు తెలుస్తోంది. అనంత‌రం విద్యాసాగ‌ర్ రావు ఏ నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తారోన‌ని స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. రాజ్‌భ‌వ‌న్ వ‌ద్ద భారీగా భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌ను చేశారు.  

  • Loading...

More Telugu News