: శుభవార్త.. ఎట్టకేలకు తెలంగాణకు ఎయిమ్స్ ప్రకటించిన అరుణ్ జైట్లీ


ఇటీవలే పార్లమెంటులో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ.. జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాల‌కు మాత్రమే ఎయిమ్స్ కేటాయించిన విష‌యం తెలిసిందే. అయితే, తెలంగాణ నుంచి వస్తోన్న ఒత్తిడి దృష్ట్యా ఆయ‌న ఈ రోజు లోక్‌స‌భ‌లో రాష్ట్రానికి కూడా ఎయిమ్స్ ప్ర‌క‌టించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్‌ ఎంపీలు వినోద్, జితేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ హర్షం వ్య‌క్తం చేశారు. అరుణ్ జైట్లీకి ధన్యవాదాలు తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు. అలాగే హైకోర్టు విభజన, ఐఐఎం ఏర్పాటు, ట్రైబల్ వ‌ర్సిటీ లాంటి ప‌లు అంశాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించాల్సి ఉంద‌ని చెప్పారు. ఐఏఎస్, ఐపీఎస్‌ల కేటాయింపులు కూడా సరిగా జరగలేదని వారు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News