: చెన్నై విమానాశ్రయంలో గవర్నర్ కు స్వాగతం పలికిన పన్నీర్.. తమిళనాట క్షణక్షణం ఉత్కంఠభరితం


తమిళనాడు తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్ రావు చెన్నై విమానాశ్రయంలో దిగారు. ఈ సందర్భంగా రాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆయనకు ఘన స్వాగతం పలికారు. సాయంత్రం 5 గంటలకు పన్నీర్ కు, 7.30 గంటలకు శశికళకు అపాయింట్ మెంట్ ఇచ్చారు గవర్నర్. అయితే ఎమ్మెల్యేల పరేడ్ (బల ప్రదర్శన)కు గవర్నర్ అనుమతి ఇవ్వలేదు. కేవలం 10 మంది బృందంతో మాత్రమే రావచ్చని సూచించారు. గవర్నర్ తో భేటీ సందర్భంగా అసెంబ్లీలో తనకు బలం నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని పన్నీర్ సెల్వం కోరే అవకాశాలు ఉన్నాయి.  

  • Loading...

More Telugu News