: తెలుగు రాష్ట్రాల్లో మ్యాట్నీతో ముందుకొచ్చిన 'సింగం-3'!
తమిళ హీరో సూర్య తాజా చిత్రం 'సింగం-3' విడుదల సాంకేతిక కారణాలతో తెలుగులో వాయిదా పడ్డట్టుగా వార్తలు వచ్చిన సంగతి విదితమే. అయితే తాజాగా ఇది థియేటర్లలో అభిమానులను పలకరించింది. హైదరాబాద్ థియేటర్లలో చిత్ర ప్రదర్శన మధ్యాహ్నం 12 గంటలకు మొదలైంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం అనుకున్నట్టుగానే ఈ ఉదయం తమిళనాడులో విడుదల కాగా, తెలుగు రాష్ట్రాల విషయంలో మాత్రం అనిశ్చితి తలెత్తిన సంగతి తెలిసిందే. అడ్డంకులన్నీ దాటుకుని చిత్ర ప్రదర్శన మొదలు కావడంతో అభిమానుల్లో ఆనందం నెలకొంది.